![]() |
||
Uday in New Tamil Flick
గుండె ఝల్లుమంది, ఏకలవ్యుడు చిత్రాలతో దాదాపు కెరీర్ పరిసమాప్తి అనుకున్న ఉదయ్ కిరణ్ మళ్ళీ మరో సినిమా పట్టాడు. అయితే ఆ సినిమా తమిళంలో ప్రారంభం కానుంది. అలాగే ఈ చిత్రానికి ఉన్న స్పెషల్ తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కథ, స్క్రీన్ ప్లే అందించటం. నందినీ ఆర్ట్స్ వారు నిర్మించే ఈ చిత్రానికి Ilavenil దర్శకత్వం వహిస్తున్నాడు. మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఉదయ్ కి తోడుగా మీరా జాస్మిన్ చేస్తోంది
![]() ఇంతకు ముందు బాలచందర్ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ పోయ్ అనే చిత్రంలో చేసారు. అది తెలుగులో అబద్దం పేరుతో రిలీజై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి చిత్రాలతో కెరీర్ ప్రారంభంలోనే హాట్రిక్ కొట్టిన ఈ హీరో ఇప్పుడు తెలుగులో ఏ సినిమానూ కమిట్ కాలేదు. తనకు తగ్గ పాత్రలు రానందునే గ్యాప్ అని మంచి కథ రాగానే సినిమా ప్రారంబిస్తానని ఉదయ్ కిరణ్ చెప్తూ వస్తున్నారు. |
![]() |